BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 17 August 2026, 01:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంబారుపేట అభివృద్ధికి మరో ముందడుగు.. మట్టి రోడ్లకు గుడ్‌బై

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 01:20 PM
95 వీక్షణలు

అంబారుపేట అభివృద్ధికి మరో ముందడుగు.. మట్టి రోడ్లకు గుడ్‌బై

ఖమ్మం జిల్లా, మధిర మండలం:

అంబారుపేట గ్రామ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. గ్రామంలో ఇప్పటివరకు ఉన్న మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని అవసరమైన అన్ని రహదారులను పరిశీలించి సీసీ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు అనుమతులు లభించాయి.

ఈ మేరకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో గ్రామంలోని రోడ్ల వెడల్పు, పొడవు, ఇతర వివరాలను సర్వే చేసి కొలతలు నమోదు చేశారు. త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

అంబారుపేట గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని గ్రామ నాయకులు తెలిపారు. ఇప్పటికే ఒకవైపు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతుండగా, మరోవైపు మిషన్ భగీరథ ద్వారా నాలుగు రోడ్లకు తాగునీటి సరఫరా అందుతోంది. తాజాగా మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆమోదం లభించడంతో గ్రామ అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.

గ్రామ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. అంబారుపేటను మరింత అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.

రోడ్ల కొలతల కార్యక్రమంలో మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత రామనాథం, వైస్ చైర్మన్ కొనదని కుమార్, అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ రామనాథన్, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రమణ గుప్తా, రంగా శ్రీను, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలుపుల వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పారుపల్లి విజయ్ కుమార్, గ్రామ పెద్దలు కర్నాటి శ్రీను, అక్కినపల్లి నాగేశ్వరరావు, ఏరువ పుల్లయ్య, పోతినేని కోటేశ్వరరావు, పోతినేని కృష్ణ, ఇంటి చంద్రమౌళి, బత్తినేని రామకృష్ణ, షేక్ నాగుల్ మీరా, అద్దంకి నాగరాజు, భయ్యా శ్రీను, కర్ణాటక రామకృష్ణ, శనగపాటి శివ, కొచ్చర్ల జయరాజు, జక్కంపూడి పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు.