BREAKING
thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
Date of Publish : 13 May 2026, 11:49 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంబులెన్స్ లేక.. బైక్‌పైనే మృతదేహం తరలింపు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 11:49 AM
195 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌ | అన్నమయ్య జిల్లా:

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం ఎగువ మల్లెలవారిపల్లిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేష్‌(30)కు అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో స్నేహితులు బైక్‌పై చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు స్నేహితులు ఆటో డ్రైవర్లను కోరినా.. ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. దీంతో చేసేదేమీ లేక వెంకటేష్ మృతదేహాన్ని బైక్‌పైనే గ్రామానికి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. 

కుటుంబ సభ్యుల రోదనలు గ్రామంలో విషాద ఛాయలు నింపాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.