BREAKING
thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 29 June 2026, 09:04 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

Yadadri: బొమ్మలరామారం తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ దీపాలు లేవు.. భద్రతపై ఆందోళన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
29 Jun, 2026 - 09:04 AM
221 వీక్షణలు

యాదాద్రి భువనగిరి | NTODAY NEWS

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో భద్రతపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన కీలక రెవెన్యూ రికార్డులు, ముఖ్యమైన ఫైళ్లు కార్యాలయంలో భద్రపరచబడిన నేపథ్యంలో తగిన వెలుతురు లేకపోవడం పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

గత కొన్ని రోజులుగా తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణం పూర్తిగా చీకటిలోనే ఉంటున్నప్పటికీ, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉండాల్సిన సమయంలో విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి, కార్యాలయానికి తగిన భద్రత కల్పించాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.