BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

రాజకీయ ప్రాధాన్యత లేని కుమ్మరులకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
29 Jun, 2026 - 07:08 AM
93 వీక్షణలు

స్వతంత్రం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్న నేటికి చట్టసభలలో కుమ్మర్లకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రాష్ట్ర జనాభాలో 14 లక్షలు ఉన్న కుమ్మరులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి దయానంద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం రోజున బొమ్మలరామారం మండల కేంద్రంలో జరిగిన మండల కుమ్మర సంఘం సర్వసభ్య సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో తక్కువ శాతం ఉన్న అగ్ర కులస్తులు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మంత్రి పదవులు అనుభవిస్తుంటే అణగారిన కులాలలో ఒకటైన కుమ్మరి కులం ఓట్లకే పరిమితమైంది తప్ప సీట్లకు పరిమితం కాలేదని వారు ఆవేదన చెందారు ఏ రాజకీయ పార్టీలైన కుమ్మర్ల ఓట్లతో లబ్ధి పొందుతున్నారు తప్ప కుమ్మర్లకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఓట్లకే పరిమితమైత కుమ్మరి కులానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని 50 సంవత్సరాలు దాటిన ప్రతి కుమ్మరి కి వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని కుమ్మర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఓట్లకే పరిమితమైన అణగారణ కులాలు ఐక్యమైతే తిరుగుబాటు వస్తుందని అలాంటి తిరుగుబాటు రాకముందుకే ప్రభుత్వాలు ఆలోచించి ఇన్నేళ్లు ఓట్ల కోసం వినియోగించుకొని పదవులు అనుభవించిన అగ్రకుల నాయకులు అణగారిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు అనంతరం హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ కనకాల కట్ట మైసమ్మ దగ్గర జూలై 16న జరిగే కుమ్మర్ల రాష్ట్ర తొలి బోనం జాతర కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం మండల శాఖ అధ్యక్షులు బేతాళ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బేతాళ బాలరాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు బోనంకుర మల్లేశం, మండల కోశాధికారి బేతాళ రాములు, కుమ్మరి సంఘం మండల యువజన విభాగం అధ్యక్షులు మల్యాల సర్పంచ్ దొమ్మాట రమాదేవి శంకర్, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపెల్లి ప్రవీణ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు తాడూరి వెంకటేష్, ప్రచార కార్యదర్శి గుమిడిల్లి భాస్కర్ తో పాటు కుమ్మరి సంఘం జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు