BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 29 June 2026, 06:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బావిలో పడిన భారీ మొసలి.. పొలాలకు వెళ్లొద్దని హెచ్చరికలు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 06:02 AM
108 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో భారీ మొసలి కలకలం సృష్టించింది. మండలంలోని మొండ్రాయిగూడెం గ్రామానికి చెందిన రైతు వాసం వీరస్వామి వ్యవసాయ బావిలో ఒక భారీ మొసలి ప్రత్యక్షమైంది. బావిలో మొసలిని గమనించిన రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని మొసలిని చూసేందుకు తరలివచ్చారు. ఈ ఘటనతో మొండ్రాయిగూడెం, సమీపంలోని ఎంచగూడెం గ్రామ ప్రజలు అప్రమత్తమయ్యారు.

ముఖ్యంగా రైతులు, గొర్ల కాపరులు, చిన్నారులు పొలాలు, చెరువులు, బావుల పరిసర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. మొసలి బావిలో ఉండటంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, దానిని సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదిలేందుకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

గ్రామాల్లో భయాందోళనలు నెలకొనడంతో ప్రజలు అవసరం లేకుండా బావుల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.