BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 July 2026, 10:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త.. తల్లికి వందనం పథకం వర్తింపు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 10:06 PM
123 వీక్షణలు

అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త.. తల్లికి వందనం పథకం వర్తింపు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు మరో శుభవార్త అందించింది. ఈ నెల 22న తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేయనున్న నేపథ్యంలో, ఈసారి సుమారు 17 వేల మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది.

మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన పిల్లలకు రూ.13 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనుంది. అలాగే పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా ఈ పథకం ప్రయోజనం కల్పించనుంది.

గతంలో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల కారణంగా అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కాలేదు. అయితే ఈసారి ఆ పరిమితులను సడలించి వారికి కూడా పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో వేలాది అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.