BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 17 July 2026, 10:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం నిర్వాసితుల పునరావాసానికి భూముల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 10:05 PM
270 వీక్షణలు

పోలవరం నిర్వాసితుల పునరావాసానికి భూముల పరిశీలన

జూలై 17: తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస గృహాల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియలో భాగంగా ఆర్డీవో కుమార్ శుక్రవారం రెవెన్యూ సిబ్బందితో కలిసి భూములను పరిశీలించారు.

పునరావాస గృహాల నిర్మాణానికి సుమారు 100 ఎకరాలకు పైగా భూమి అవసరమని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పెనుగొలను గ్రామంలోని మెట్టగుట్ట సమీప ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆర్డీవో, భూమి యజమానులైన రైతులతో సమావేశమై భూసేకరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తే తమ భూములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పలువురు రైతులు అధికారులకు తెలిపారు. భూముల అనుకూలత, విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మెట్టగుట్ట సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటుతో జనాభా పెరిగి, అక్కడి శేషాచల శ్రీనివాస స్వామి ఆలయానికి కూడా అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని స్థానిక నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.