BREAKING
thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు
Date of Publish : 17 July 2026, 10:06 pm
Posted by : V శ్రీనివాస్

​ఈ నెల 31లోగా రేషన్ కార్డులకు ఈ-కేవైసీ తప్పనిసరి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 Jul, 2026 - 10:06 PM
234 వీక్షణలు

​ఈ నెల 31లోగా రేషన్ కార్డులకు ఈ-కేవైసీ తప్పనిసరి

​- వంద శాతం ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

​- గడువు దాటితే రేషన్ పంపిణీలో ఇబ్బందులు తప్పవు

​- వెల్లడించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు

​మంచిర్యాల: జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని రేషన్ కార్డుదారులందరూ ఈ నెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ, మండల రేషన్ షాపు డీలర్ల సంఘం ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ పంపిణీలో పారదర్శకతను నిర్ధారించడంతో పాటు, నకిలీలను ఏరివేసి అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ రాయితీలు నిరంతరాయంగా అందాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసిందన్నారు. జిల్లాలో ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదని, మండల స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి వంద శాతం నమోదు పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

​రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడు స్వయంగా తమ పరిధిలోని లేదా సమీపంలోని ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్లి, ఈ-పాస్ (e-POS) యంత్రంలో వేలిముద్రలు వేసి ఈ-కేవైసీ నమోదు పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయని లబ్ధిదారులు భవిష్యత్తులో రేషన్ సరుకుల పంపిణీ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. కావున కార్డుదారులందరూ వెంటనే స్పందించి ఈ-కేవైసీని పూర్తి చేసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, డీలర్ల సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు