BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 July 2026, 09:58 pm
Posted by : V శ్రీనివాస్

​మున్సిపల్ పర్మినెంట్ కార్మికుడు చిప్పకుర్తి అంకులు కన్నుమూత

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 Jul, 2026 - 09:58 PM
133 వీక్షణలు

​మున్సిపల్ పర్మినెంట్ కార్మికుడు చిప్పకుర్తి అంకులు కన్నుమూత - నివాళులర్పించిన మేయర్, మున్సిపల్ అధికారులు

​మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ గుడిపేట గ్రామానికి చెందిన మున్సిపల్ పర్మినెంట్ కార్మికుడు చిప్పకుర్తి అంకులు అనారోగ్యంతో కన్నుమూశారు. మున్సిపాలిటీకి సుదీర్ఘకాలం పాటు తన వంతుగా ఎన్నో విశేష సేవలందించిన ఆయన, నిన్న రాత్రి 10 గంటల సమయంలో అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త స్థానికంగా మరియు తోటి మున్సిపల్ కార్మికులలో తీవ్ర విషాదాన్ని నింపింది.

​ఈ విషాద వార్త తెలుసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పెంట రాజయ్య (ధరణి మధుకర్), స్థానిక 17వ డివిజన్ కార్పొరేటర్ లగిసెట్టి రాజయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, అసిస్టెంట్ కమిషనర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం తదితరులు ఈరోజు గుడిపేటలోని అంకులు స్వగృహానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, మున్సిపల్ విభాగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకతప్తమైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, మనోధైర్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు