BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 July 2026, 09:57 pm
Posted by : V శ్రీనివాస్

​వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 Jul, 2026 - 09:57 PM
180 వీక్షణలు

​వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి: మేయర్ దర్ని మధుకర్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9, 33వ డివిజన్లలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 'డ్రై డే - ఫ్రై డే' కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై, డివిజన్లలోని నీరు నిల్వ ఉండే పలు ప్రాంతాలను పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకునే జాగ్రత్తలపై ఆయన ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు జిల్లా వైద్యాధికారి (DMHO), వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా ప్రజలు తమ వంతు బాధ్యతగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తను ఆరుబయట వేయకుండా, ఇంటింటికీ వచ్చే మున్సిపల్ చెత్త సేకరణ సిబ్బందికి అందించి పూర్తిగా సహకరించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టి, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు