BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 July 2026, 09:58 pm
Posted by : కూనురు మధు

భూముల రీ-సర్వే అవగాహన సదస్సు ​

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
17 Jul, 2026 - 09:58 PM
96 వీక్షణలు

భూముల రీ-సర్వే అవగాహన సదస్సు ​

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూముల రీ-సర్వే అవగాహన గ్రామ సభ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ గ్రామంలో రీ-సర్వే కోసం గెజిట్ జారీ చేయగా, నిర్ణీత షెడ్యూలు ప్రకారం సోమవారం నుండి మండల సర్వే బృందం పనులను ప్రారంభించనుంది.  మొదట ఇతర గ్రామాలతో ఉన్న సరిహద్దులను, ఆపై గ్రామంలోని రోడ్లు, చెరువులు, కుంటల హద్దులను గుర్తిస్తారు. అనంతరం ప్రతి సర్వే నెంబరులో రైతుల అధీనంలో ఉన్న భూములకు సర్వే చేస్తారు.  పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో, పారదర్శకంగా అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఈ సర్వే జరుగుతుంది అని . పట్టాదారులకు ముందస్తు నోటీసులు ఇచ్చి, వారి సమక్షంలోనే హద్దులు నిర్ణయించి 'భూధార్' నెంబరు జారీ చేస్తారు అని తెలిపారు రైతుల సందేహాలను తీర్చడానికి ప్రత్యేకంగా సేవా కేంద్రాన్ని అందుబాటులో ఉంచుతామని తహశీల్దార్ యం. విజయ్ కుమార్ తెలిపారు. దీనివల్ల ఏళ్ల తరబడి ఉన్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.  ​


ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అందె అండాలు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ వినోద మోహన్ రెడ్డి, టాక్స్ ఛైర్మన్ రఘుమా రెడ్డి, తహశీల్దార్ విజయ్ కుమార్, మండల సర్వేయర్ రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు