BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 05 June 2026, 09:12 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
05 Jun, 2026 - 09:12 PM
41 వీక్షణలు

చిలకలూరిపేట రూరల్:అనారోగ్య సమస్యలు తాళలేక ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మురికిపూడి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామంలోని మిట్టమీద నివాసం ఉంటున్న షేక్ జానీ భాషా (43) చికెన్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఆయనకు బీపీ పెరిగి కుడి వైపు స్వల్పంగా పక్షవాతం రావడంతో తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుఅంటించుకున్నాడు. గమనించిన చిన్న కూతురు జమీర స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2:50 గంటలకు జానీ భాషా మృతి చెందాడు. 15 ఏళ్ల మృతుడి చిన్న కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక మార్చురీకి తరలించారు.