BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 03 August 2026, 08:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అన్నవరంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:42 PM
50 వీక్షణలు

అన్నవరంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ.. 

ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ కె. కమలబాయి మాట్లాడుతూ, శిశువు పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం, తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే అందించడం అత్యంత అవసరమని తెలిపారు. తల్లిపాలే శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగనిరోధక శక్తిని అందించే తొలి రక్షణ అని వివరించారు.

అంగన్‌వాడీ టీచర్ గరికపాటి జ్యోతి కుమారి కార్యక్రమాన్ని సమన్వయం చేసి తల్లిపాల ప్రాధాన్యతపై తల్లులకు అవగాహన కల్పించారు. తల్లి–శిశు సంక్షేమం కోసం ఆమె అందిస్తున్న సేవలను అధికారులు అభినందించారు.

కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, జీఎంఎస్‌కే సభ్యులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. చివరగా "తల్లిపాలే బిడ్డకు తొలి ఆహారం.. తొలి రక్షణ" అనే సందేశంతో కార్యక్రమాన్ని ముగించారు.