BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 05 June 2026, 11:03 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ సుప్రియ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Jun, 2026 - 11:03 AM
98 వీక్షణలు

అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ సుప్రియ హెచ్చరిక 

అన్నమయ్య జిల్లా పుంగనూరు 

పేరెంట్స్కు సుప్రియ స్వీట్ వార్నింగ్

పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులే బాధ్యులు: ఎంవీఐ సుప్రియ

మైనర్లు వాహనాలు నడపరాదని, అలా చేస్తే తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ హెచ్చరించారు. పుంగనూరులో ఆమె మాట్లాడుతూ.. రోడ్లపై ఎక్కువ శాతం మైనర్లే వాహనాలు నడుపుతూ ఉండటాన్ని గమనిస్తున్నామన్నారు. పోలీసు శాఖ సమన్వయంతో తనిఖీలు చేపడతామని, ఇప్పటికైనా మారాలని ఆమె హితవు పలికారు.

పుంగనూరులో మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ సుప్రియ హెచ్చరించారు. గురువారం ఎంవిఐ సుప్రియ విలేకరులతో మాట్లాడుతూ రోడ్లపై ఎక్కువ శాతం మైనర్లే అయినటువంటి బాలబాలికలే ద్విచక్ర వాహనాలు నడుపుతున్నట్లు గమనిస్తున్నామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని సుప్రియ అన్నారు. అదేవిధంగా మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు అవుతారని ఎంవిఐ సుప్రియ హెచ్చరించారు. త్వరలో పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. మైనర్

డ్రైవింగ్ను నిరోధించడంలో తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిల్లల భద్రత కోసం వాహనాల తాళాలు వారికి అందుబాటులో ఉంచవద్దని ఆమె సూచించారు రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ఈ సందర్భంగా ఎంవిఐ సుప్రియ కోరారు.