BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 30 May 2026, 06:47 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అసలైన దొంగలు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసినా నకిలీ డీలర్లే..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 06:47 AM
238 వీక్షణలు

డీలర్ల నుండి దందా చేస్తున్న వేలాగ్రా ఉద్యోగి పై చర్యలు తీసుకోండి..

వ్యాల్ ఆగ్రో 37 37 రకం డ్రిప్ నకిలీ ఎరువులు వారే సరఫరా చేసి మాపై కేసుల..

పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సోమల మండలం కందూరు గ్రామానికి చెందిన ఎరువుల డీలర్ రాకేష్ శుక్రవారం సోమల నందు తనకు జరిగిన అన్యాయంపై మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందూరు గ్రామంలో నేను నా కుటుంబం మూడు తరాలుగా ఎరువుల వ్యాపారం చేస్తూ ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా నాణ్యమైన ఎరువులు అందిస్తు రైతుల మన్నానాలను పొందడం జరిగిందన్నారు.

గత 30సంవత్సరలుగా ఎరువులను రైతులుకు అమ్మి రైతులకు అధిక లాభాలు వచ్చే విధంగా  రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు.

 కొద్ది రోజుల కిందట నా సొంత వ్యవసాయం కోసం పలమనేరులోని ఒక డీలర్ నుండి వేలాగ్రా కంపెనీకి సంబంధించిన ఎరువులను నేను కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

ఆ ఎరువులు నకిలీవని రాయల సీమ జిల్లా వేలాగ్రా డీలర్ గా ఉన్న పుంగనూరు అన్నదాత రవి వద్ద వేలాగ్రా ఎరువుల కంపెనీ ఉద్యోగిగా పనిచేస్తున్న మురళి  మాకు తెలియజేయడం జరిగిందన్నారు.

వెంటనే నేను  పలమనేరు కు చెందిన డీలర్ ను సంప్రదించి వారిని అడగగా వేలాగ్రా కంపెనీ వారే ఆ ఎరువులు సరఫరా చేశారని మాకు తెలియజేశారు.

రైతు మా పై పిర్యాదు చేయగా అతను అతని వెంట వచ్చిన వారికీ మా షాప్ లో ఎటువంటి నకిలీ ఎరువులు దొరక్కపోయినప్పటికీ వేలాగ్రా కంపెనీ ప్రతినిధి మురళి జిల్లా డీలర్ గా ఉన్న అన్నదాత రవి ఎక్కడినుండో నకిలీ ఎరువులు తెచ్చి మా షాప్ లోనే దొరికినాయని మాపై అక్రమంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

నియోజవర్గ పరిధిలో ఉన్న డీలర్లకు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసి నకిలీ ఎరువులని డీలర్లు అందరిపై ఒత్తిడి తెచ్చి వారి నుండి లంచాల రూపంలో నగదు దండుకోవడం జరిగిందన్నారు.

ఒక సామాన్య ఉద్యోగిగా ఉన్న మురళి నకిలీ ఎరువులు డీలర్లకు విక్రయించి కోట్ల రూపాయలు దండుకొని  కోట్లాది రూపాయల ఆస్తులు కూడా  పెట్టుకోవడం జరిగిందని,దీనిపై సమగ్ర విచారణ జరిపి నకిలీ ఎరువుల బాగోతాన్ని నిగ్గు తేల్చాలని  కోరుతున్నామన్నారు.  

మమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతూ మా గౌరవానికి భంగం  కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా నకిలీ ఎరువులు తయారీ వారిపై చర్యలు చేపట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు.

మా షాపులో కూడా ఉన్న ఎరువులను ల్యాబ్ కు పంపించి పరిశీలించి నిజనిర్ధారణ చేయాలని నా వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నామన్నారు 

నాపై ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టిన వారిపై వెంటనే పోలీసులు సంబంధాలు అధికారులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.