BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 14 July 2026, 12:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నేటితో ముగియనున్న ఓటర్ల ఎన్యూమరేషన్.. గడువు పొడిగింపునకు లేఖ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 12:47 PM
107 వీక్షణలు

అమరావతి, జులై 14: రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) ద్వారా లేదా ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించని ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 98.32 శాతం మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మిగిలిన అర్హులైన ఓటర్లు కూడా తమ వివరాలను వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, జిల్లా కలెక్టర్ల సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ఎన్యూమరేషన్ గడువును మరో 10 రోజులు పొడిగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ పంపించారు.

గడువు పొడిగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ఇంకా ఫారం సమర్పించని ఓటర్లు ఆలస్యం చేయకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.