BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 15 May 2026, 04:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 04:04 PM
144 వీక్షణలు

అత్యాచార ఆరోపణలతో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సీఐ చిన్నమల్లయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెడమల్లి బాలాజీ వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వు చేశారు.

పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 29న చిన్నమల్లయ్యపై అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ చిన్నమల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదు చేసిన మహిళకు చిన్నమల్లయ్యతో ఐదేళ్ల పరిచయం ఉందని తెలిపారు. ఆమె పలు మార్లు డబ్బులు తీసుకున్నారని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. అలాగే చిన్నమల్లయ్య కుమారుడిపై కూడా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇక ప్రభుత్వం తరఫున సహాయ పీపీ ప్రియాంక వాదనలు వినిపిస్తూ, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. బాధితురాలికి బెదిరింపు సందేశాలు పంపిన అంశంపై విచారణ కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. నిందితుడికి పటుత్వ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నందున దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు.