BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 03 June 2026, 06:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అవ్వల ఆశీర్వాదాలు... తాతల చిరునవ్వులు... దివ్యాంగుల ఆనందమే ఎన్టీఆర్ భరోసా విజయానికి నిదర్శనం..!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 06:59 PM
111 వీక్షణలు

అవ్వల ఆశీర్వాదాలు... తాతల చిరునవ్వులు... దివ్యాంగుల ఆనందమే ఎన్టీఆర్ భరోసా విజయానికి నిదర్శనం..!

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం హృద్యంగా సాగింది. ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్ అందుకున్న తర్వాత వారి ముఖాల్లో కనిపించిన ఆనందం, కళ్లలో మెరిసిన సంతోషం కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తూ, పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని పేర్కొన్నారు. అధికారాన్ని ప్రజాసేవకు వినియోగిస్తూ సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.

పెన్షన్ అందుకున్న పలువురు వృద్ధులు భావోద్వేగానికి లోనై, "ఇలాంటి ప్రభుత్వం మాకు నిజమైన భరోసా" అంటూ ఆనందం వ్యక్తం చేయడం తనను కదిలించిందన్నారు. కొందరు పెద్దలు కృతజ్ఞతతో కన్నీటి పర్యంతం కావడం ఈ పథకం ప్రజల జీవితాల్లో ఎంతటి మార్పు తీసుకువచ్చిందో తెలియజేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే తమ రాజకీయాల పరమావధి అని మరోసారి స్పష్టం చేశారు.