BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 02 May 2026, 03:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అయ్యా చంద్రబాబు… నా ధాన్యం కొనుగోలు చేసి నా బిడ్డ పెళ్లి జరిపించండి!”

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 03:32 PM
165 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లాలో రైతుల ఆవేదన మళ్లీ రోడ్లెక్కింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేస్తామని ప్రకటిస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ తీవ్రంగా విమర్శించారు.

విస్సన్నపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో రైతులు తమ సమస్యలను వెల్లగక్కారు. చండ్రుపట్ల పెద్ద తండాకు చెందిన బాణావతు రాణి మాట్లాడుతూ, మూడు ఎకరాల్లో పండించిన 1126 నెంబర్ ధాన్యం సుమారు 280 బస్తాలు వచ్చాయని తెలిపింది. గత 18 రోజులుగా ధాన్యాన్ని ఎండబెట్టి రైతు భరోసా కేంద్రం చుట్టూ తిరుగుతున్నా కొనుగోలు జరగలేదని వాపోయింది.

అకాల వర్షాల ముప్పు కారణంగా ధాన్యం తడిసిపోతుందనే భయం వెంటాడుతుందని, కనీసం గన్నీ సంచులు, టార్పాలిన్ పట్టాలు కూడా సరఫరా చేయలేదని ఆరోపించింది. మార్కెట్‌లో రూ.2,500 ఉండే టార్పాలిన్ పట్టాలను బ్లాక్ మార్కెట్‌లో రూ.4,500కు కొనాల్సి వచ్చిందని తెలిపింది. తన కుమార్తె పెళ్లి ఈ నెల 10న జరగాల్సి ఉందని, ధాన్యం అమ్మకంతో వచ్చే డబ్బుతో పెళ్లి జరిపించాలని భావిస్తున్నప్పటికీ, కొనుగోలు ఆలస్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక మిల్లర్లు సరైన సంచులు ఇవ్వకపోవడంతో పాటు, రవాణా ఖర్చులు, తరుగు పేరుతో ప్రతి సంచికి మూడు కిలోల వరకు రైతులపై అదనపు భారం మోపుతున్నారని రైతులు ఆరోపించారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, లేదంటే రైతాంగం తరఫున భారీ నిరసనలు చేపడతామని హరినాథ్ హెచ్చరించారు.

ఈ ధర్నాలో పులగం వెంకటేశ్వర రెడ్డి, దుర్గం పుల్లారావు, వేముల బక్కయ్య, పరికళ కళావతి, మేకల కుమారి, చాట్ల బాబురావు, తేలేటి జమలయ్య, భూతం మారయ్య, భవాని, సీతామాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.