BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 21 June 2026, 09:20 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అయ్యర్లా జాతీయ మహాసభ విజయవంతం చేయండి!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 09:20 AM
191 వీక్షణలు

విసన్నపేటలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం

ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేటలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షతన జరిగింది.

సమావేశం ప్రారంభంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ కేంద్ర నేత, అమరజీవి కామ్రేడ్ నందకిషోర్ ప్రసాద్ అకాల మరణానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ మహాసభలు నవంబర్ 20, 21 తేదీలలో జార్ఖండ్‌లో జరుగనున్నాయని, వాటిని విజయవంతం చేయడానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామ గ్రామాన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాధ్ పిలుపునిచ్చారు.

అదేవిధంగా అఖిలభారత కిసాన్ మహాసభ జాతీయ మహాసభలు పంజాబ్‌లో జరుగనున్నాయని తెలిపారు.

జూలై 28న చారుమజుందార్ వర్ధంతి సందర్భంగా గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘పీపుల్స్ సిక్స్ డిమాండ్స్’ సాధన కోసం ఉద్యమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధాతధంగా అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య, జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబూరావు, మేడూరి సర్వేసు, భవాని, కలపాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.