BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 02 June 2026, 08:35 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Jun, 2026 - 08:35 PM
127 వీక్షణలు

బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన: డాక్టర్ అయూబ్ ఖాన్

అన్నమయ్య జిల్లా. పుంగనూరు 

 స్థానిక బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మరుగుదొడ్ల వద్ద ప్రహరీ గోడ కూలిపోయి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని డాక్టర్ పి అయూబ్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందలాది మంది విద్యార్థినులు చదువుకునే ఈ ప్రతిష్టాత్మక కళాశాలలో మరుగుదొడ్ల సమీపంలో గోడ లేకపోవడం వల్ల బాలికల రక్షణ, గోప్యత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రహరీ గోడ లేని కారణంగా ఆకతాయిల సంచారం పెరిగే ప్రమాదం ఉందని, విద్యార్థినులు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి, అత్యవసర నిధులు కేటాయించి ప్రహరీ గోడను నిర్మించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా పనులు ప్రారంభించకపోతే, విద్యార్థినుల భద్రత కోసం అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.