BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 26 June 2026, 07:19 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బావిలో పూడిక తీయడానికి దిగి ఇద్దరు కూలీలు మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 07:19 AM
137 వీక్షణలు


ఏలూరు జిల్లా, పోలవరం మండలం, నూతనగూడెంలో విషాదం చోటుచేసుకుంది. బావిలో పూడిక తీయడానికి దిగిన ఇద్దరు కూలీలు ఊపిరాడక మృతి చెందారు.

స్థానికుల వివరాల ప్రకారం, నూతన గూడెంకు చెందిన బండి మునేశ్వరరావు ఇంటి బావిలో పూడిక తొలగించేందుకు గణేష్ నగర్‌కు చెందిన రాజుతో పాటు పైడిపాక పునరావాస కాలనీకి చెందిన బండి వీర వెంకటరావు, చిట్టిబాబు (రెడ్డి) వెళ్లారు.

ముందుగా చిట్టిబాబు బావిలోకి దిగగా ఊపిరాడటం లేదంటూ కేకలు వేశాడు. అతడిని కాపాడేందుకు వీర వెంకటరావు కూడా బావిలోకి దిగాడు. అయితే ఇద్దరూ లోపలే చిక్కుకుపోయారు. స్థానికులు తాడుతో బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలవరం సీఐ కృష్ణకుమార్, ఎస్సై అప్పారావు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు.

ఈ ఘటనతో నూతన గూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.