BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 09 May 2026, 05:57 pm
Posted by : NTODAY NEWS

బీసీల కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
09 May, 2026 - 05:57 PM
144 వీక్షణలు

బీసీల కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : TRP అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్: దేశవ్యాప్త జనగణనలో బీసీలకు ప్రత్యేకంగా కులవారీ గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు V. హనుమంతరావు అంబర్‌పేటలోని తన నివాసంలో శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిసి దీక్షకు తన పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీలకు నిజమైన సామాజిక న్యాయం అందాలంటే కులగణన అత్యంత అవసరమని పేర్కొన్నారు. బీసీల జనాభా, వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులపై ఖచ్చితమైన సమాచారం లేకుండా సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పటికప్పుడు బీసీల సమస్యలపై స్పందిస్తూ వారి హక్కుల సాధన కోసం పోరాటం చేస్తోందని తీన్మార్ మల్లన్న తెలిపారు. రాష్ట్ర జనాభాలో బీసీలు గణనీయమైన శాతం ఉన్నప్పటికీ, సరైన గణాంకాల లేమితో అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ సమానంగా చేరడం లేదని ఆయన అన్నారు. హనుమంతరావు చేపట్టిన ఈ ఆమరణ నిరాహార దీక్ష బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతి కోసం జరుగుతున్న చారిత్రక పోరాటమని అభివర్ణించారు.

జనగణనలో బీసీల కులగణనను వెంటనే చేర్చాలని, బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు మరియు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, బీసీల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీల హక్కుల సాధనలో హనుమంతరావు చేస్తున్న పోరాటం ప్రశంసనీయమని పేర్కొన్న తీన్మార్ మల్లన్న, అవసరమైతే ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమం విజయవంతం అయ్యే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలా మద్దతు అందిస్తారని తెలిపారు.