BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 15 August 2026, 05:18 pm
Posted by : కూనురు మధు

బస్సు ఢీకొని 21 నెలల చిన్నారి మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
15 Aug, 2026 - 05:18 PM
391 వీక్షణలు
బస్సు ఢీకొని 21 నెలల చిన్నారి మృతి 

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో 21 నెలల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన రామన్నపేట మండలం తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం) గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం  ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో గ్రామానికి చెందిన ఈర్లపల్లి మురళి తన పెద్ద కుమార్తె ఈర్లపల్లి శ్రేష్ఠజ్ఞ మాన్సినిని బస్సు ఎక్కించేందుకు తీసుకువచ్చారు. అదే సమయంలో ఆయన 21 నెలల చిన్న కుమార్తె ఈర్లపల్లి అభిజ్ఞతార కూడా బస్సు సమీపానికి వచ్చింది. ఆ సమయంలో బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో చిన్నారిని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బస్సు చిన్నారిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రామన్నపేట ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు...