BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 13 April 2026, 05:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Apr, 2026 - 05:21 PM
265 వీక్షణలు

బూరుగుగూడెంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన ప్రత్యేక అధికారి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారి మాసగిరి శ్రీనివాస్, గ్రామంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, తడి చెత్త, పొడి చెత్త ద్వారా రైతులకు ఉపయోగపడే వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారుచేసి, వాటిని రైతన్నలకు అందించాలనే ప్రణాళికను ప్రస్తావించారు. ఇది సహజ సిద్ధమైన ఎరువుగా పంటలకు మంచి పోషకాలు అందించి, పంట నాణ్యత పెరగడానికీ, రైతులకు మేలు చేకూర్చే దిశగా ఉండేలా చూడాలని సూచించారు.

అనంతరం, గ్రామ కార్యదర్శి రాజగోపాల్ ను, గ్రామంలో మంచినీటి కొరత లేకుండా చూసుకోవడం, వీధిలైట్లు సక్రమంగా వెలగాలని, అలాగే వీధుల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని పలు సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాజగోపాల్ కూడా పాల్గొన్నారు.