BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 May 2026, 02:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 02:55 PM
180 వీక్షణలు

బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఫాదర్ రెవరెండ్ పోలిశెట్టి జయరాజు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్థనలు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఫాదర్ పోలిశెట్టి జయరాజు మాట్లాడుతూ చర్చ్ సేవా భావం, సమాజంలో ప్రేమ, ఐక్యత, సహకారం పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక విలువలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

వేడుకల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భక్తుల మధ్య ఆత్మీయతను మరింత పెంచింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ పెద్ద దేశిరెడ్డి రాఘవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని, యువత కూడా సేవా భావంతో ముందుకు రావాలని తెలిపారు.

అలాగే ఉమ్మడి సీతారాములు, కాలసాని సూర్య నారాయణ మాట్లాడుతూ సమాజంలో మత సమన్వయం, పరస్పర గౌరవం పెంపొందాలని పేర్కొన్నారు.

ఇంకా రాజబోయిన దశరధ రామరాజు, జనసేన నాయకుడు వెల్లంకి శ్రీమన్నారాయణ, గోవర్ధన రెడ్డి, సుబ్బారావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.