BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 03 June 2026, 05:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:35 PM
192 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్ట్రాయి మండల పరిధిలో మండల స్థాయిలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో చిత్తపూరు గ్రామం తరఫున జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో బీఎల్ఓ, బీఎల్ఏల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటింటి ఓటరు ధృవీకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా వలసలు వెళ్లిన వారి ఓట్లు, మరణించిన వారి పేర్లపై ఉన్న ఓట్లు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన ఓట్లను గుర్తించి పరిశీలన అనంతరం తొలగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. గతంలో మరణించిన వ్యక్తుల ఓట్ల తొలగింపుకు డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి కాగా, కొత్త నిబంధనల ప్రకారం సంబంధిత రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్ల అంగీకారం, సంతకాలతో కూడా ఓటును తొలగించే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

అలాగే నియోజకవర్గ స్థాయిలో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో త్వరలో బూత్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల నుంచి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ కమిటీ ఏజెంట్లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వలసపల్లి రామకృష్ణ, బత్తుల శివ, జంగాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

— చాట్రాయి మండల జనసేన పార్టీ.