BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 August 2026, 10:35 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బయ్యారంలో వింత ఘటన...

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 10:35 AM
96 వీక్షణలు

బయ్యారంలో వింత ఘటన.. మర్రి చెట్టు వేరు నుంచి కారుతున్న మర్రి కల్లు!

సోషల్ మీడియాలో వైరల్.. చెట్టును చూసేందుకు తరలివస్తున్న ప్రజలు

బయ్యారం: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న చిన్నాల కుంట చెరువు వద్ద ఓ వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా తాటి, ఈత చెట్ల నుంచి లభించే కల్లు.. తాజాగా ఓ మర్రి చెట్టు వేరు నుంచి రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. చిన్నాల కుంట చెరువు సమీపంలోని మర్రి చెట్టు వేరు నుంచి నాలుగైదు రోజులుగా ద్రవం కారుతుండటాన్ని గీత కార్మికుడు ఆకుల శ్రీను గమనించాడు. పరిశీలించగా అది మర్రి కల్లు అని గుర్తించి, చెట్టు వేరుకు గీతలు పెట్టి లొట్టి కట్టాడు. దీంతో లొట్టిలో కల్లు పడటాన్ని చూసిన పలువురు ఆసక్తిగా అక్కడికి చేరుకుని మర్రి కల్లు రుచిచూసేందుకు క్యూలు కడుతున్నారు.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పలువురు ఈ వింతను చూసేందుకు తరలివస్తున్నారు. మర్రి చెట్టు నుంచి కల్లు రావడం అరుదైన ఘటన అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.

గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. మర్రి చెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్నకు చెందిన వ్యవసాయ బావి పూడికతో నిండిపోయింది. బావిలో పూడిక తొలగింపు పనులను ప్రోక్లైన్ యంత్రంతో చేపట్టగా, ఆ సమయంలో మర్రి చెట్టుకు చెందిన ఓ పెద్ద వేరు తెగిపోయింది. అప్పటి నుంచి మూడు నాలుగు రోజులుగా ఆ వేరు నుంచి ద్రవం కారడాన్ని గమనించినట్లు తెలిపారు.

వేరుకు గీత పెట్టి లొట్టి ఏర్పాటు చేయగా అందులో మర్రి కల్లు పడుతోందని, ప్రస్తుతం దానిని సేకరించి విక్రయిస్తున్నట్లు శ్రీను వెల్లడించారు. ఈ వింత ఘటన బయ్యారం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. చెట్టు వేరు నుంచి కల్లు రావడానికి గల కారణాలపై స్థానికులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.