BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 01 February 2026, 07:02 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బీసివై డిజిటల్ పోరాటానికి పదునైన ఆయుధం

తెలంగాణ
01 Feb, 2026 - 07:02 AM
404 వీక్షణలు
బీసివై డిజిటల్ పోరాటానికి పదునైన ఆయుధం రాష్ట్ర సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్‌గా కుమ్మర గిరిబాబు నియామకం NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు ప్రజా వ్యతిరేక పాలనకు ఎదురుగా సాగుతున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత చైతన్య యువజన పార్టీ (బీసివై) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్‌గా కుమ్మర గిరిబాబును నియమిస్తూ పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ వేదికపై ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువచ్చే విషయంలో, అలాగే బీసివై పార్టీ ఆశయాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో గిరిబాబు చూపిన చురుకైన, కట్టుదిట్టమైన పోరాట తత్వాన్ని గుర్తించి ఈ కీలక బాధ్యతను అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బాధ్యతలపై స్పందన ఈ సందర్భంగా కుమ్మర గిరిబాబు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీలు, బహుజనులు, పేదల గొంతుకగా బీసివై పార్టీ సాగిస్తున్న ఉద్యమాన్ని సోషల్ మీడియా అనే బలమైన వేదిక ద్వారా మరింత ఉధృతం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి అధికార మత్తులో మునిగిన ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడతామని, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ప్రధాన లక్ష్యం పార్టీ ఆశయాలకు అనుగుణంగా బీసివై కార్యక్రమాలు, ఉద్యమాలు, రాజకీయ పోరాటాలను ప్రతి గ్రామం, ప్రతి యువకుడి వరకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని గిరిబాబు తెలిపారు. బీసీల హక్కులు, బహుజనుల ఆత్మగౌరవం కోసం సాగుతున్న బీసివై రాజకీయ పోరాటంలో సోషల్ మీడియా విభాగం కీలక పాత్ర పోషించనుందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. #BCYParty #KummaraGiribabu #DigitalPolitics #SocialMediaCoordinator #BCYouth #BahujanVoice #FightForRights #IndianPolitics Follow us on Website Facebook Instagram YouTube