BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 March 2026, 02:29 pm
Posted by : కూనురు మధు

భగత్ సింగ్ ఆశయాల సాధనకు విద్యార్థులు, యువత ముందుకు రావాలి

తెలంగాణ
17 Mar, 2026 - 02:29 PM
283 వీక్షణలు

భగత్ సింగ్ ఆశయాల సాధనకు విద్యార్థులు, యువత ముందుకు రావాలి

నల్లగొండలో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ఆశయాలను సాధించేందుకు విద్యార్థులు, యువత ముందుకు రావాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి శంకర్ పిలుపునిచ్చారు.

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ), భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్థంతి సందర్భంగా విద్యార్థి, యువజన స్మారకోత్సవాలు నిర్వహిస్తున్నారు.

దీని భాగంగా మంగళవారం దొడ్డికొమరయ్య భవనం నుంచి ప్రకాశం బజార్, క్లాక్ టవర్ మార్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను సరైన స్థాయిలో ప్రాచుర్యం ఇవ్వడం లేదని విమర్శించారు.

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లాంటి మహానుభావులు 23 ఏళ్ల వయస్సులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. వారి స్ఫూర్తితో నేటి యువత సమాజంలో చైతన్యం కలిగించేలా ముందుకు రావాలని కోరారు.

విద్యార్థులు, యువకులు గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, పోటీ ప్రపంచంలో నిలబడాలంటే చదువే ముఖ్యమని సూచించారు. నిజమైన దేశభక్తిని పెంపొందించేలా విద్యార్థి, యువజన సంఘాలు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పూలెంల్ల శ్రీకర్, జిల్లా సహాయ కార్యదర్శి కట్టెల లింగస్వామి, నాయకులు కోరే రమేష్, ముస్కు రవీందర్, మారుపాక కిరణ్, పంది నరేష్, సైఫ్, అరూరి ప్రణీత్, జగదీష్, కండె యాదగిరి, బోడ్డు పల్లి నరేష్, అంజి, బాలరాజు, పోకల శశి, శ్రవణ్, నవదీప్, వర్షీత్, హరి తదితరులు పాల్గొన్నారు.