BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 26 June 2026, 10:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భూమి కోసం భర్త హత్య.. భార్య, కుమార్తె, అల్లుడు అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 10:38 PM
116 వీక్షణలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఆవంచ గ్రామానికి చెందిన యాదయ్య(54) హత్య కేసును పోలీసులు ఛేదించి భార్య అలివేల, అల్లుడు ఆంజనేయులు, కుమార్తె పద్యను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. 1.5 ఎకరాల భూమిని అల్లుడు పేరుపై రాయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయగా, యాదయ్య నిరాకరించడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో జూన్ 23న ముగ్గురు కలిసి ఇంట్లోనే యాదయ్యపై దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది.

అల్లుడు గొంతు పిసికగా, కుమార్తె కాళ్లు పట్టుకుని, భార్య ఇనుప రాడ్‌తో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, మృతదేహానికి స్నానం చేయించే సమయంలో గాయాలను గుర్తించిన బంధువులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు జూన్ 26న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

కేసు వివరాలను నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. అరెస్టు ప్రక్రియలో సీఐ అశోక్ రెడ్డి, తిమ్మాజిపేట ఎస్సై శ్రీనివాసరావు పాల్గొన్నారు.