BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 05 February 2026, 11:19 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

హుజూరాబాద్ 27వ వార్డులో బీజేపీ ప్రచారం ఉధృతం

తెలంగాణ
05 Feb, 2026 - 11:19 PM
383 వీక్షణలు
హుజూరాబాద్ 27వ వార్డులో బీజేపీ ప్రచారం ఉధృతం అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్–కాంగ్రెస్‌పై ధ్వజం NTODAY NEWS: రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ రిపోర్టర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో బీజేపీ అభ్యర్థి తాళ్లపల్లి దేవేంద్ర ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆమె స్థానికులను కలుసుకుని తమ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అభివృద్ధి చేస్తామంటూ ఓటర్లను మభ్యపెట్టే మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గత పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో గానీ, గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గానీ 27వ వార్డుకు గణనీయమైన అభివృద్ధి జరగలేదని విమర్శించారు. వార్డులో ఉన్న మౌలిక వసతుల సమస్యలను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, కమలం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో 27వ వార్డు బీజేపీ ఇంచార్జ్ సంపత్ కుమార్, జంపాల సువర్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #Huzurabad #KarimnagarDistrict #MunicipalElections #BJPCampaign #Ward27 #LocalElections #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube