చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
చిట్యాల, సెప్టెంబర్ 23: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో చిట్యాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత రక్తదానం చేశారు.
బీజేవైఎం నాయకులు సిలువేరు నాగరాజు, కొండే కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరానికి బీజేవైఎం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు.
రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి సహాయం అందుతుందని, యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ చిట్యాల పట్టణ, మండల అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్, పీక వెంకన్న ముదిరాజ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు కన్నెబోయిన మహాలింగం యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న, జయరాపు రామకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, సీనియర్ నాయకులు కంచర్ల శంకర్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.