BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 27 February 2026, 08:51 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ధర్మపురిలో వైభవంగా బ్రహ్మోత్సవాల అంకురార్పణ

తెలంగాణ
27 Feb, 2026 - 08:51 AM
215 వీక్షణలు
ధర్మపురిలో వైభవంగా బ్రహ్మోత్సవాల అంకురార్పణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పుట్ట బంగారం సేకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి: క్షేత్రనాథుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ‘పుట్ట బంగారం’ సేకరణ బ్రహ్మోత్సవాల ఆనవాయితీ ప్రకారం పట్టణంలోని చింతామణి చెరువు గట్టు వద్ద పుట్ట బంగారం సేకరించడంతో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఆలయం నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా చెరువు గట్టుకు తీసుకువచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్ట బంగారాన్ని సేకరించారు. దీంతో ఉత్సవాలకు శుభారంభం లభించింది. భక్తులకు పూర్తి సదుపాయాలు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, దేవాలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. #Dharmapuri #Brahmotsavam #LakshmiNarasimhaSwamy #TempleFestival #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube