BRS నేతలపై చర్యలు తీసుకోవాలి
చిట్యాల
BRS నేతలపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్ యువజన విభాగం డిమాండ్
చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో నిన్న జరిగిన ఘటనలను నిరసిస్తూ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఆవరణలో BRS పార్టీ నేతలు చేసినట్లు ఆరోపిస్తున్న అసాంఘిక కార్యక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా MLC తాతా మధు శాసన మండలి స్పీకర్‌పై చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత, అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయనపై తగిన చర్యలు తీసుకుని శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
అలాగే KTR, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, సుధీర్ రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలని, వారిని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న BRS ఎమ్మెల్యేలపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఏనుగు రఘమారెడ్డి, సీనియర్ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు పల్లపు బుద్ధుడు, చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, జన్నపాల శ్రీను 4వ వార్డు సభ్యులు. చెరుకు సైదులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు. సాగర్ల నరేష్, లింగస్వామి, మహేష్, రాము. తదితరులు పాల్గొన్నారు.