BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 28 June 2026, 11:55 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Health: చాట్రాయి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 11:55 AM
126 వీక్షణలు

ఏలూరు జిల్లా | చాట్రాయి మండలం | జూన్ 29 | NTODAY NEWS

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని చాట్రాయి గ్రామ సచివాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) బి. రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో బి. రాజు మాట్లాడుతూ, పోలియో వ్యాధికి శాశ్వత చికిత్స లేకపోయినా, సమయానికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి టీకా వేయించాలని సూచించారు.

"పల్స్ పోలియో చుక్కల్లోనే పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు దాగి ఉంది. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి" అని ఆయన పిలుపునిచ్చారు.

పిల్లల ఆరోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని అధికారులు పేర్కొంటూ, ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.