BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 28 April 2026, 07:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలం లో ఎక్సైజ్ పాత నేరస్తులు ఆరుగురు బైండోవర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 07:47 PM
165 వీక్షణలు

చాట్రాయి మండలం లో ఎక్సైజ్ పాత నేరస్తులు ఆరుగురు బైండోవర్ 

నవోదయం–2.0లో భాగంగా నాటు సారాపై కఠిన చర్యలు – 6 మందిపై బైండ్ ఓవర్

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలనకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా పాత నేరస్తులపై చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలో నూజివీడు పరిధిలోని ఆరుగురు పాత నేరస్తులను చాట్రాయి తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేశారు. ఈ బైండ్ ఓవర్ ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుందని, ఆ కాలంలో మళ్లీ ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై రూ.1 లక్ష జరిమానా విధించబడుతుందని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా రద్దు చేయబడతాయని తహసీల్దార్ హెచ్చరించారు.

బైండ్ ఓవర్ చేయబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి:

వజ్రపు రాంబాబు (పోతనపల్లి), బెజవాడ శ్రీనివాసరావు (జనార్ధనవరం), ఈడ అర్జున్ రావు (పోలవరం), కలవకోల్లు రెడ్డయ్య (పోలవరం), పామర్తి నాగరాజు (టీ గుడిపాడు), గాదే రాటాలు (పోలవరం).

అదేవిధంగా నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటు సారా తయారీ, విక్రయం, నిల్వలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య తెలిపారు. నాటు సారా తయారీలో ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, అలాగే బెల్లపు ఊట్లు కలిగిన భూస్వాములపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.