BREAKING
thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు
Date of Publish : 31 July 2026, 09:04 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పదవీ విరమణ ఉపాధ్యాయులు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 Jul, 2026 - 09:04 PM
33 వీక్షణలు

పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు కృష్ణమూర్తికి ఘన సన్మానం
మట్లవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమం

అన్నమయ్య జిల్లా | రామసముద్రం | N Today News

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మట్లవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన కృష్ణమూర్తి పదవీ విరమణ సందర్భంగా పాఠశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ నాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల కమిటీ చైర్మన్ టి. కృష్ణప్ప, ఎంఈవో-1 హేమలత, ఎంఈవో-2 ఆంజనేయులు, మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చిట్టిబాబు, ఇందిర, రమేష్ బాబు, రాజు, మండల ఉపాధ్యాయులు, ఎస్‌టీయూ నాయకులు అయూబ్ ఖాన్, మురళి, రమాదేవి, సుబ్బారెడ్డి, నర్సింహులు, మహీధర్ రావు, మహీధర్ రెడ్డి, సీఆర్‌పీ దామోదర్, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఇతరులు పాల్గొని కృష్ణమూర్తిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కృష్ణమూర్తి ఉపాధ్యాయ వృత్తిలో నిబద్ధతతో సేవలందించి ఎందరో విద్యార్థుల అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన అందించిన విద్యా సేవలను గుర్తు చేసుకుంటూ, పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమం అనంతరం సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు కృష్ణమూర్తికి వీడ్కోలు పలికారు.

#Annamayya #Ramasamudram #Education #Retirement #NTodayNews