BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 14 September 2026, 10:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో గ్రంథాలయోద్యమ పితామహుడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Sep, 2026 - 10:12 PM
1 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సోమవారం శిరిడీ సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో గ్రంథాలయోద్యమ పితామహుడు, స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు 143వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ 1883 సెప్టెంబర్ 14న జన్మించిన గాడిచర్ల హరి సర్వోత్తమరావు తెలుగుజాతికి అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా గుర్తింపు పొందిన ఆయన గ్రంథాలయోద్యమ నాయకుడిగా, పత్రికా రచయితగా, పత్రికా సంపాదకుడిగా, సాహితీవేత్తగా తనదైన ముద్ర వేశారని తెలిపారు.

ఆంగ్లంలోని ‘ఎడిటర్’కు తెలుగు పదమైన ‘సంపాదకుడు’ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన వ్యక్తిగా హరి సర్వోత్తమరావుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం ‘సౌందర్యవల్లి’ అనే పత్రికను నిర్వహించారని వివరించారు. అలాగే ‘స్వరాజ్య’ అనే తెలుగు పత్రికను ప్రారంభించి బ్రిటిష్ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని తెలిపారు.

హరి సర్వోత్తమరావు దేశ స్వాతంత్ర్యం, తెలుగు భాష, సాహిత్యం, పత్రికా రంగం, గ్రంథాలయోద్యమం కోసం చేసిన సేవలను నేటితరం గుర్తుంచుకోవాలని వక్తలు సూచించారు. అనంతరం పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కరణం నాగేశ్వరరావు, ముక్కెర జనార్దన్ రెడ్డి, శీలం నాగిరెడ్డి, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వార్తను ఖాళీలు లేకుండా ఇవ్వండి

హెడ్డింగ్‌ను మరింత ప్రభావవంతంగా మార్చండి

వార్తను సంక్షిప్తంగా మార్చండి