BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 14 September 2026, 10:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు మున్సిపాలిటీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Sep, 2026 - 10:01 PM
0 వీక్షణలు

అభ్యంతరాలు, మార్పులు ఉంటే సెప్టెంబర్‌ 17లోగా తెలియజేయాలి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు పురపాలక సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 8 నుంచి 12వ తేదీ వరకు ఐదు రోజులపాటు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలను పరిశీలించిన అనంతరం ముసాయిదా జాబితాను సిద్ధం చేశారు.

సెప్టెంబర్‌ 14న తిరువూరు రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం, తహశీల్దార్‌ కార్యాలయం, తిరువూరు పురపాలక సంఘం కార్యాలయాల్లో 28 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించినట్లు అధికారులు తెలిపారు.

ముసాయిదా జాబితాలో తమ పేరు లేదా ఓటర్ల వివరాల్లో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే ఫారం–2 లేదా ఫారం–3 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత దరఖాస్తులను సెప్టెంబర్‌ 17వ తేదీలోగా తిరువూరు పురపాలక సంఘం కార్యాలయంలో సమర్పించాలని అధికారులు కోరారు.

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రజలు ముసాయిదా ఓటర్ల జాబితాలను పరిశీలించి, వివరాల్లో తప్పులు ఉంటే నిర్ణీత గడువులోగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.