BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 27 August 2026, 06:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి: రైతులు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి ఏవో బి శివశంకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 06:22 PM
128 వీక్షణలు

చాట్రాయి: రైతులు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి ఏవో బి శివశంకర్ 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని ప్రతి రైతు తాము సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ-పంటలో నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు.

సెప్టెంబర్ 15వ తేదీలోపు ఈ-పంట నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు పూర్తి వివరాలతో తమ గ్రామంలోని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) వద్ద ఈ-పంట నమోదు చేసుకోవాలని తెలిపారు.

అలాగే వరి సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా ఆగస్టు 31వ తేదీలోపు ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద ఎకరానికి రూ.840 చెల్లిస్తే పంట బీమా వర్తిస్తుందని వివరించారు.

ఈ సందర్భంగా చనుబండ గ్రామంలోని వరి పొలాలను వ్యవసాయ అధికారి పరిశీలించారు. రైతులకు నీటి యాజమాన్య పద్ధతులు, పంట మార్పిడి విధానం, ఆరుతడి పంటల సాగు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సూక్ష్మ సేద్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

ఈ క్షేత్ర సందర్శనలో గ్రామ వ్యవసాయ సహాయకురాలు నాగమణి, రైతులు, నక్క రాము తదితరులు పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ పంటల నమోదు, బీమా ప్రక్రియలను సకాలంలో పూర్తిచేసుకోవాలని అధికారులు కోరారు.