BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 08 September 2026, 10:07 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి: వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 10:07 AM
55 వీక్షణలు

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో గ్రామాల్లో విగ్రహాల ఏర్పాటు, పూజా కార్యక్రమాలు, నిమజ్జనాలకు ఏర్పాట్లు జరుగుతున్నందున నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణ సూచించారు. పండుగ వేడుకలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిబంధనలు పాటించాలని కోరారు.

వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రదేశం ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఎంపిక చేసుకోవాలని తెలిపారు. రోడ్లకు అడ్డంగా, విద్యుత్‌ తీగలకు సమీపంలో మండపాలు ఏర్పాటు చేయరాదని, విద్యుత్‌ ప్రమాదాల నివారణకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఎస్‌ఐ స్పష్టం చేశారు. అలాగే మైక్‌లు, డీజేలు, ఇతర శబ్ద పరికరాల వినియోగానికి సంబంధిత అనుమతులు తీసుకోవాలని, నిర్ణయించిన సమయాల్లో మాత్రమే వాటిని వినియోగిస్తూ నిబంధనలు పాటించాలని సూచించారు.

నిమజ్జన ఊరేగింపు సమయంలో పోలీసులు సూచించిన మార్గాలను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

ఉచితంగా ఏకగవాక్ష విధానంలో అనుమతులు

సెప్టెంబర్‌ 14 నుంచి వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వినాయక మండపాల ఏర్పాటుకు ఏకగవాక్ష అనుమతుల విధానాన్ని అమలు చేస్తోందని ఎస్‌ఐ తెలిపారు. ganeshutsav.net ద్వారా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రక్రియ పూర్తిగా ఉచితమని పేర్కొన్నారు.

వినాయక చవితి, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు నిర్వాహకులు, భక్తులు పోలీసు శాఖకు సహకరించాలని డి. రామకృష్ణ కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.