సీసీ, బీటీ రోడ్లకు రూ.6.07 కోట్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం.. మారంపల్లిలో పనులకు భూమిపూజ
ద్వారకాతిరుమల | Ntoday News
ద్వారకాతిరుమల మండల ప్రజల దశాబ్దాల రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మారంపల్లి నుంచి తిరుమలపాలెం అడ్డరోడ్డు వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్న రహదారి నిర్మాణానికి రూ.6.07 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా గుర్తించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయించినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ నిధులతో సీసీ, బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
మంగళవారం మారంపల్లి గ్రామంలో రహదారి నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, ద్వారకాతిరుమల మండల టీడీపీ అధ్యక్షుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపాలపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేకు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు.
మారంపల్లి–తిరుమలపాలెం రహదారి నిర్మాణానికి రూ.6.07 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు ద్వారకాతిరుమల మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు దేవరపల్లి వీరాస్వామి చౌదరి, గోపాలపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పాతూరి సహృదయ, మండల పార్టీ నాయకులు నాదెళ్ల వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిలుకూరి విశ్వేశ్వరరావు, నాదెళ్ల సురేంద్రనాథ్ చౌదరి, నాదెళ్ల వేణు, దేవరపల్లి హేమంత్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.