తొర్రూరు మండలంలో బీఆర్‌ఎస్ మహిళల ధర్నా
మహిళా ఎమ్మెల్యేలపై దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన
తొర్రూరు | Ntoday News
అసెంబ్లీలోకి వెళ్తున్న బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై జరిగినట్లు పేర్కొంటున్న దాడిని ఖండిస్తూ తొర్రూరు మండలంలో బీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల అవమానకరంగా వ్యవహరించడం యావత్ మహిళా సమాజాన్ని అవమానించడమేనని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. మహిళల గౌరవం, హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని తెలిపారు.
మహిళా ప్రజాప్రతినిధులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
– పాలకుర్తి రిపోర్టర్ వేణు