BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 08 September 2026, 10:05 am
Posted by : కూనురు మధు

ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలంv

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
08 Sep, 2026 - 10:05 AM
51 వీక్షణలు


ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు మంగళవారం చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా చిట్యాల పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో వ్యాపారి బండారు జనార్ధన్ మృతి చెందిన నేపథ్యంలో ఫ్లైఓవర్ పనులను వెంటనే వేగవంతం చేయాలని కోరారు. పట్టణంలోని పారిశుద్ధ్యం, మరుగుకాలువల సమస్యలను పరిష్కరించాలని, రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించడంతో పాటు పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని కోరారు. రెండో వార్డులో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యుత్ స్తంభాలు, లో-వోల్టేజ్, రాత్రి వేళల్లో లైటింగ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పదో వార్డులో ఓపెన్ డ్రైనేజీపై స్లాబ్ నిర్మించాలని, మేడం పండు కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్‌ను ₹4,016కు పెంచి అందించాలని, వంట గ్యాస్ సిలిండర్‌ను ₹500కే అందించాలని, ప్రతి మహిళకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం అందిస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే రైతు కూలీలకు సంవత్సరానికి ₹12,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు.