BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 08 September 2026, 10:12 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

గ్రామాల్లో రాత్రి బస.. ప్రజలకు పోలీసుల విస్తృత అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Sep, 2026 - 10:12 AM
8 వీక్షణలు

ప్రజా భద్రతపై ప్రత్యేక చైతన్యం.. నేర రహిత సమాజమే లక్ష్యమని అన్నమయ్య జిల్లా పోలీసులు

మదనపల్లె | Ntoday News

ప్రజా భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు నేరాల నివారణకు ప్రజలను భాగస్వాములను చేసే లక్ష్యంతో అన్నమయ్య జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజలతో నేరుగా మమేకమై భద్రతా అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

మహిళలు, చిన్నారుల రక్షణ, పోక్సో చట్టాలు, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గంజాయి నిర్మూలనతో పాటు హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రత తదితర అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఉత్సవ కమిటీలకు పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లు, నిబంధనల పాటింపు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు.

అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు.

నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి ప్రజా భద్రతను కాపాడేందుకు భాగస్వాములు కావాలని అన్నమయ్య జిల్లా పోలీసులు పిలుపునిచ్చారు.