BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 05 August 2026, 04:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులకు పలు సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 04:26 PM
130 వీక్షణలు

చాట్రాయి, ఆగస్టు 5: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చాట్రాయి గ్రామంలో బుధవారం మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులకు ఎల్‌నీనో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వినియోగించాలని, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వరి సాగు చేసే రైతులందరూ తప్పనిసరిగా ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)లో నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఆగస్టు 15లోపు ప్రీమియం చెల్లిస్తే బీమా వర్తిస్తుందని, ఒక ఎకరానికి వరి పంటకు రూ.840, మినుము పంటకు రూ.300 ప్రీమియంగా నిర్ణయించినట్లు వివరించారు.

రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువుల నిల్వలు పీఏసీఎస్‌లు, రిటైల్ దుకాణాల్లో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏపీఏఐఎంఎస్ యాప్, ఏపీఎఫ్‌ఆర్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ, పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ జరుగుతుందని వివరించారు.

అలాగే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ జీవామృతం, ఘనజీవామృతం వినియోగం వల్ల మొక్కలు సుమారు 15 రోజుల వరకు నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యం పొందుతాయని రైతులకు సూచించారు.