BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 20 May 2026, 04:48 pm
Posted by : V శ్రీనివాస్

చెన్నూరు నియోజకవర్గంలో నకిలీ పత్తి విత్తనాలపై ప్రత్యేక అవగాహన సదస్సు

తెలంగాణ
/ మంచిర్యాల / చెన్నూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 May, 2026 - 04:48 PM
143 వీక్షణలు

రైతులు అప్రమత్తంగా ఉండాలి – అనధికారిక విత్తనాల కొనుగోలు, అమ్మకాలపై కఠిన చర్యలు.

చెన్నూరు నియోజకవర్గ పరిధిలో నకిలీ,అనధికారిక పత్తి విత్తనాల రవాణా, నిల్వ,అమ్మకం మరియు కొనుగోళ్లను అరికట్టేందుకు వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ,పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కిష్టంపేట్ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల నుంచే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.నకిలీ మరియు అనధికారిక విత్తనాల వాడకం వల్ల దిగుబడులు తగ్గిపోవడంతో పాటు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశముందని తెలిపారు.విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకోవడం, ప్యాకెట్‌పై కంపెనీ పేరు,లాట్ నంబర్, గడువుతేదీ తదితర వివరాలను పరిశీలించడం తప్పనిసరి అని వివరించారు. అనుమానాస్పదంగా విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప వ్యవసాయ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.అనధికారికంగా పత్తి విత్తనాలను నిల్వ చేయడం, రవాణా చేయడం, అమ్మకం నిర్వహించడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు,రెవెన్యూ సిబ్బంది,పోలీస్ అధికారులు,రైతులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.