BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 23 August 2026, 06:05 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి నియోజకవర్గంలో మరో మూడు 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:05 AM
105 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గంలో మరో మూడు 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలు : ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

చింతలపూడి: నియోజకవర్గ ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా మరో మూడు 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఈ మేరకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శనివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ అంబేద్కర్‌తో ప్రత్యేకంగా సమావేశమై విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు.

కామవరపుకోట మండలం పాపయ్యపాలెం, చింతలపూడి మండలం పొనుకుమాడు గ్రామాల్లో ఇప్పటికే నూతన విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరు కాగా, వాటి ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా చింతలపూడి మండలం చింతపల్లి గ్రామంలో మరో నూతన విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ అంశంపై ఎమ్మెల్యే రోషన్ కుమార్‌తో ట్రాన్స్‌కో ఎస్సీ అంబేద్కర్, డి. రాంబాబు తదితర అధికారులు చర్చించారు.

నూతన విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరగడంతో పాటు, రైతులు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల బలోపేతానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.