చింతలపూడి: పోలీస్ సిబ్బందికి దంత సంరక్షణపై అవగాహన
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడిలో జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, చింతలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ పర్యవేక్షణలో స్థానిక జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో పోలీస్ కవాతు నిర్వహించారు. కవాతు అనంతరం పోలీస్ సిబ్బందికి దంత సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ రాంబాబు పోలీస్ సిబ్బందికి దంతాల సంరక్షణపై పలు సూచనలు చేశారు. దంతాలను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన విధానం, దంత ఆరోగ్యం లోపించడం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నిత్య జీవితంలో దంత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు.
అనంతరం పోలీస్ సిబ్బందికి ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎస్సై సతీష్ కుమార్, ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్నతో పాటు చింతలపూడి సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.